Jagan: ఏపీలో ప్రతిరోజు 9 నుంచి 10 వేల కేసులు: వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీకి చెప్పిన జగన్

jagan speaks with modi
  • సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
  • 25 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశామన్న జగన్
  • ప్రతి 10 లక్షల మందిలో 47,459 మందికి పరీక్షలు
  • పాజిటివ్‌ల గుర్తింపుతో మరణాలను అదుపులో ఉంచే ఛాన్స్
కరోనా నివారణ చర్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీకి ఏపీ సీఎం జగన్ పలు వివరాలు తెలిపారు.

ఏపీలో 25 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశామని జగన్ చెప్పారు. ప్రతి 10 లక్షల మందికి 47,459 మందికి పరీక్షలు చేశామన్నారు. తాము సాధ్యమైనంత త్వరగా పాజిటివ్ కేసులను గుర్తిస్తున్నామని ఆయన చెప్పారు. పాజిటివ్ కేసుల గుర్తింపుతో మరణాలను అదుపులో ఉంచే అవకాశం ఉంటుందని తెలిపారు.

తాము వైద్య సదుపాయం అందించడమే కాకుండా రోగులను ఐసోలేషన్ చేస్తున్నామని జగన్ చెప్పారు. కరోనా వచ్చే నాటికి రాష్ట్రంలో వైరాలజీ ల్యాబ్ కూడా లేదని ఆయన వివరించారు. ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ ల్యాబులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో 2 లక్షల మంది వాలంటీర్లు కరోనా నివారణ చర్యల్లో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రతిరోజు 9 నుంచి 10 వేల కేసులు నమోదవుతున్నాయని చెప్పారు.
Jagan
YSRCP
Andhra Pradesh
Narendra Modi
Corona Virus

More Telugu News