Rhea Chakraborty: సుశాంత్ వ్యవహారంలో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన రియా చక్రవర్తి

Rhea Chakraborty approaches Supreme Court once again
  • సుశాంత్ ఆత్మహత్యకు తనను బాధ్యురాల్ని చేస్తున్నారన్న రియా
  • మీడియాలోనూ దారుణ కథనాలు వస్తున్నట్టు వెల్లడి
  • ఇప్పటికే ఓసారి రియాకు సుప్రీంలో నిరాశ
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో తనను బాధ్యురాల్ని చేస్తూ, మీడియాలో దారుణమైన రీతిలో కథనాలు వస్తున్నాయని ఆరోపిస్తూ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, రియా ఇంతకుముందు ఓసారి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, నిరాశే ఎదురైంది. తనకు రక్షణ కల్పించాలని, ఈ కేసును పాట్నా నుంచి ముంబయికి బదిలీ చేయాలంటూ న్యాయస్థానాన్ని కోరింది. అయితే సుప్రీం కోర్టు అందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం రియా ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆమెను ఇప్పటికే ఈడీ పలు దఫాలుగా ప్రశ్నించింది. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి కోట్లాది రూపాయలు ఎటు వెళ్లాయన్నదానిపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది.
Rhea Chakraborty
Supreme Court
Plea
Sushant Singh Rajput
Media Trial
Bollywood

More Telugu News