Vijayawada: సర్కారు అనుమతితోనే అక్కడ చికిత్స చేస్తున్నాం.. స్వర్ణ ప్యాలెస్ నిర్వహణతో మాకు సంబంధం లేదు: రమేశ్ ఆసుపత్రి స్పష్టీకరణ

ramesh hospital gives clarity on covid centre
  • ఎక్కువ మంది బాధితులకు వైద్యం అందించాలన్నదే ఉద్దేశం
  • అందుకే స్వర్ణ ప్యాలెస్ ‌ను కరోనా చికిత్సా కేంద్రంగా మార్చాం  
  • ఇక్కడ కరోనా బాధితులు చక్కగా కోలుకుంటున్నారు 
విజయవాడలో కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. ఆ ఆసుపత్రే స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌ను లీజుకు తీసుకుని కొవిడ్‌-19 కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, స్వర్ణప్యాలెస్ హోటల్ నిర్వహణతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

సర్కారు అనుమతితోనే అక్కడ కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నామని చెప్పింది. ఎక్కువ మంది కొవిడ్‌-19 బాధితులకు వైద్యం అందించాలన్న ఉద్దేశంతో స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ను కరోనా చికిత్సా కేంద్రంగా మార్చామని తెలిపింది. హోటల్ నిర్వహణతో సంబంధం లేకుండా తాము రోగులకు వైద్య సేవలు అందించామని వివరించింది.  

రోగులను చేర్చుకోవాలని భారీగా వినతులు వస్తుండడంతో అన్ని సౌకర్యాలున్న హోటల్లో సర్కారు అనుమతితో రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపింది. ఇక్కడ చికిత్స తీసుకున్న కరోనా బాధితులు చక్కగా కోలుకుంటున్నారని వివరించింది.
Vijayawada
Fire Accident
COVID-19
Corona Virus

More Telugu News