Vijayawada: విజయవాడ కరోనా ఆసుపత్రి అగ్ని ప్రమాదం... ఇంతవరకూ ఏడుగురి దుర్మరణం!

Seven Died in Swarna Palace Fire Accident
  • స్వర్ణా ప్యాలెస్ లో భారీ అగ్ని ప్రమాదం
  • తొలి అంతస్తు నుంచి కిందకు దూకిన నలుగురు
  • బాధితులను ఆసుపత్రులకు తరలించామన్న సీపీ
ఈ తెల్లవారుజామున విజయవాడలోని రమేశ్ హాస్పిటల్స్ యాజమాన్యం, హోటల్ స్వర్ణా ప్యాలెస్ లో నిర్వహిస్తున్న కొవిడ్-19 చికిత్సా కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకూ ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకుని వచ్చిన తరువాత, లోనికి వెళ్లిన సహాయక సిబ్బంది ఊపిరాడక మరణించిన వారిని గుర్తించారు.

కాగా, తొలుత గ్రౌండ్ ఫ్లోర్, ఆపై తొలి అంతస్తులో అంటుకున్న మంటలు, పై అంతస్తులకు వ్యాపించాయి. తొలి అంతస్తు నుంచి కేకలు వేస్తూ, నలుగురు వ్యక్తులు కిందకు దూకారని తెలుస్తోంది. సహాయక బృందాలు, భవంతి అద్దాలను పగులగొట్టి మరికొందరిని నిచ్చెనల సాయంతో కిందకు తీసుకుని వచ్చారు. బాధితులను మెట్ల మార్గం ద్వారా తీసుకు వచ్చేందుకు వీలు పడలేదని వెల్లడించిన నగర సీపీ శ్రీనివాసులు, ఇప్పటికే బాధితులను ఇతర ఆసుపత్రులకు తరలించామని అన్నారు.
Vijayawada
Swarna Palace
Covid-19

More Telugu News