Vizag: విశాఖ ఫిష్ హార్బర్ వద్ద అగ్ని ప్రమాదం
- చేపల వేటకు వెళ్లిన బోటు
- తిరిగి వస్తుండగా బోటులో మంటలు
- రూ. 50 లక్షల వరకు ఆస్తి నష్టం
ఇప్పటికే పలు వరుస ప్రమాదాలతో విశాఖ నగరం భయం గుప్పిట్లో ఉంది. తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదం జరిగింది. బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి ఒడ్డుకు చేరుకోవడంతో ప్రాణనష్టం తప్పింది.
ఈ ప్రమాదంలో రూ. 50 లక్షల వరకు నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈరోజు చేపల వేట కోసం ఓ ఫిషింగ్ బోటు సముద్రంలోకి వెళ్లింది. చేపల వేటను పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాదం గురించి పోర్టు అధికారులకు మత్స్యకారులు సమాచారం అందించారు.