స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలకు యనమల కౌంటర్
- చట్టసభల విషయాల్లో కోర్టుల జోక్యం ఉండరాదన్న తమ్మినేని
- చట్టవిరుద్ధంగా ఉంటే కోర్టులు జోక్యం చేసుకుంటాయన్న యనమల
- స్పీకర్ మాటలు సభలో ఒకలా, బయట మరోలా ఉన్నాయని విమర్శలు
రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీల వద్ద పెండింగ్ లో ఉన్నాయని హైకోర్టుకు ఏజీ తెలిపినప్పుడు, ప్రభుత్వం ఆ బిల్లులను మరోసారి సభలోకి ఎలా తీసుకువచ్చిందని యనమల ప్రశ్నించారు. ఇది చట్టవిరుద్ధం కాబట్టే తమ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని వెల్లడించారు. ఈ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందని, ఈ రెండు బిల్లులకు చెందిన శాసన ప్రక్రియ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఈ వివరాలను గౌరవనీయ అసెంబ్లీ స్పీకర్ తెలుసుకుంటే బాగుంటుందని యనమల పేర్కొన్నారు. స్పీకర్ మాటలు సభలో ఒకలా ఉంటే, వెలుపల మరోలా ఉంటున్నాయని విమర్శించారు.