కరోనాతో టీటీడీ అర్చకుడు శ్రీనివాసాచార్యులు మృతి

TTD priest dies with Corona virus
  • నాలుగు రోజుల క్రితం స్విమ్స్ ఆసుపత్రిలో చేరిన శ్రీనివాసాచార్యులు
  • చికిత్స పొందుతూ మృతి
  • ఆయన వయసు 45 ఏళ్లు
ఏపీలో ప్రతి రోజు దాదాపు 10 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాలకు మహమ్మారి క్రమంగా విస్తరిస్తోంది. హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల కొండపై కూడా కరోనా ప్రభావం చూపుతోంది.

ఇప్పటికే పలువురు అర్చకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కరోనా రక్కసి కారణంగా అర్చకుడు ఎన్వీ శ్రీనివాసాచార్యులు కన్నుమూశారు. ఆయన వయసు 45 సంవత్సరాలు. నాలుగు రోజుల క్రితం ఆయన తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

వాస్తవానికి ఆయన తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయంలో అర్చకులుగా ఉన్నారు. డిప్యుటేషన్ పై తిరుమలకు వచ్చారు. అయితే, శ్రీనివాసాచార్యులు మరణాన్ని టీటీడీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Go Back to Shorts
TTD
Priest
Dead
Corona Virus

More Telugu News