Corona Virus: 73 వేలు దాటిన తెలంగాణ కరోనా కేసుల సంఖ్య!

Telangana Corona Cases Crossed 73 Thousands
  • బుధవారం కొత్తగా 2,092 కేసులు
  • మొత్తం మృతుల సంఖ్య 589
  • హైదరాబాద్ లో తాజాగా 535 పాజిటివ్ లు
తెలంగాణలో బుధవారం నాడు 2,092 కొత్త కరోనా కేసులు వచ్చాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,050కు చేరుకుందని ఈ ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. నిన్న 13 మంది వైరస్ కారణంగా మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 589కి పెరిగిందని వెల్లడించింది. నిన్న మొత్తం 1,289 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, దీంతో ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 52,103కు చేరగా, మరో 20,358 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని పేర్కొంది.

 బుధవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 21,346 మంది నమూనాలను పరీక్షించామని, ఇప్పటివరకూ 5.43 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించామని తెలిపారు. నిన్న నిర్వహించిన టెస్టుల్లో 1,550 మంది ఫలితాలు వెల్లడికావాల్సి వుందని తెలియజేశారు. ఇక నిన్న వచ్చిన కొత్త కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 535 కేసులు వున్నాయి. ఆ తరువాత రంగారెడ్డి జిల్లాలో 169 కేసులు, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 126, కరీంనగర్ జిల్లాలో 123, వరంగల్ పట్టణ పరిధిలో 128 కేసులు నమోదయ్యాయి.
Corona Virus
Telangana
New Cases

More Telugu News