వంగపండు ఉషకు ఫోన్ చేసిన ఏపీ సీఎం జగన్!

ఉత్తరాంధ్ర జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు కుమార్తె ఉషకు స్వయంగా ఫోన్ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆమెను పరామర్శించారు. తెలుగు జాతి ఓ ప్రజా గాయకుడిని కోల్పోయిందని వ్యాఖ్యానించిన ఆయన, వంగపండు మృతిపై తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, ఉష ప్రస్తుతం ఏపీ క్రియేటివిటీ కల్చరల్ కమిషన్ చైర్ పర్సన్ గా విధులను నిర్వర్తిస్తున్నారు. మంగళవారం నాడు హార్ట్ ఎటాక్ తో వంగపండు ప్రసాదరావు మరణించారన్న సంగతి తెలిసిందే.

Vangapandu Usha
Jagan
Phone
Vangapandu Prasada Rao

More Telugu News