Mekathoti Sucharitha: చంద్రబాబు సవాల్ పై హోంమంత్రి సుచరిత స్పందన

Sucharitha demands Chandrababu to resign with TDP MLAs
  • చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి
  • తాము రాజధానిని తరలించడం లేదు
  • అమరావతి రైతులకు కౌలు పెంచిన ఘనత జగన్ దే
రాజధాని విషయంలో దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ సవాల్ పై ఏపీ హోంమంత్రి సుచరిత స్పందిస్తూ... చంద్రబాబు మొదట టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని అన్నారు. విశాఖ జిల్లాకు చెందిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. తాము రాజధానిని తరలించడం లేదని... కేవలం అధికార వికేంద్రీకరణ మాత్రమే చేస్తున్నామని చెప్పారు. అమరావతి ప్రాంత రైతులకు కౌలు పెంచిన ఘనత జగన్ దని అన్నారు.

దళితులపై దాడికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని సుచరిత చెప్పారు. కాశీబుగ్గలో దళితుడిని కాలితో తన్నిన సీఐను సస్పెండ్ చేశామని తెలిపారు. ఘటనకు కారణమైన పోలీసులపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టామని చెప్పారు. టీడీపీ హయాంలో దళితులను చింతమనేని, ఆదినారాయణరెడ్డి కించపరిస్తే చంద్రబాబు మందలించలేదని విమర్శించారు. వైసీపీ హయాంలో మహిళలపై దాడులు, వరకట్న వేధింపులు తగ్గాయని చెప్పారు.
Mekathoti Sucharitha
YSRCP
Chandrababu
Telugudesam
Amaravati

More Telugu News