Lupin: కరోనాకు 'కోవిహాల్ట్' ట్యాబ్లెట్లను, ధరను ప్రకటించిన ఫార్మా కంపెనీ లుపిన్!

Pharma company Lupin announces tablets for Corona
  • యాంటి వైరల్ డ్రగ్ ఫివిపరవిర్ కు జెనరిక్ వర్షన్ ను తీసుకొస్తున్న లుపిన్
  • ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 49
  • సన్ ఫార్మా నుంచి కూడా జనరిక్ వర్షన్ 
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుక్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు, ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తాజాగా ప్రముఖ ఫార్మా కంపెనీ లుపిన్ కీలక ప్రకటన చేసింది. కరోనా బాధితులకు చికిత్సలో భాగంగా యాంటీ వైరల్ డ్రగ్ ఫివిపరవిర్ ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి జెనరిక్ వర్షన్ ను 'కోవిహాల్ట్' పేరుతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. 200 ఎంజీతో 10 ట్యాబ్లెట్లతో స్ట్రిప్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని తెలిపింది. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 49గా ఉంటుందని వెల్లడించింది.

ఫావిపిరవిర్ కు జెనరిక్ వర్షన్ ను తీసుకొస్తున్నట్టు సన్ ఫార్మా కూడా ప్రకటించింది. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 35గా ఉంటుందని సన్ ఫార్మా తెలిపింది.
Lupin
Corona Virus
Tablet

More Telugu News