Sadananda Gowda: కలియుగం.. రాముడి కంటే మోదీ పెద్దవాడయ్యారు: ఖుష్బూ

Modi became bigger than LLord Rama critisices Khushboo
  • అయోధ్యకు భూమిపూజ చేసిన మోదీ
  • మోదీపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు
  • మోదీని రాజుగా పేర్కొన్న సదానందగౌడ
నేటితో కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక నెరవేరింది. అయోధ్య రామమందిరం నిర్మాణం ప్రారంభమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈరోజు భూమిపూజ జరిగింది. ఈ నేపథ్యంలో మోదీపై పెద్ద ఎత్తున అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దశాబ్దాల కలను మోదీ నెరవేర్చారని ప్రశంసిస్తున్నారు.

కర్ణాటక బీజేపీ ఎంపీ సదానందగౌడ ఈ ఉదయం ట్వీట్ చేస్తూ... తన ప్రియతమ రాజు మోదీని తిరిగి స్వాగతించడానికి అయోధ్య సిద్ధంగా ఉందని అన్నారు. ఈ ట్వీట్ ను సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ షేర్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాముడి కంటే మోదీ ఎక్కువయ్యాడని... కలికాలం అంటే ఇదేనని విమర్శించారు.
Sadananda Gowda
BJP
Narendra Modi
Khushboo
Congress

More Telugu News