Venkaiah Naidu: అయోధ్య భూమిపూజ సందర్భంగా రామాయణ పఠనం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Venkaiah Naidu chants Ramayana
  • ఉప రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేక పూజలను నిర్వహించిన వెంకయ్య
  • తన సతీమణితో కలిసి రామాయణ పఠనం
  • అయోధ్యలో ముగిసిన భూమిపూజ కార్యక్రమం
దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అయోధ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో హిందువులంతా భక్తిశ్రద్ధలతో గడుపుతున్నారు. సామాన్యుల వద్ద నుంచి, ప్రముఖుల వరకు వారి ఇంటి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన అధికార నివాసంలో రాముడికి పూజలను నిర్వహించారు. తన సతీమణి ఉషతో కలిసి పూజలు చేశారు. రామాయణ పఠనం కూడా చేశారు.

ఈ విషయాన్ని పూజ అనంతరం వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఉప రాష్ట్రపతి భవన్ సిబ్బంది కూడా రామాయణ పఠనంలో పాల్గొన్నట్టు వెంకయ్య వెల్లడించారు. మరోవైపు అయోధ్యలో ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం ముగిసింది.
Venkaiah Naidu
Ramayan
BJP

More Telugu News