Ayodhya: అయోధ్యలో పారిజాత మొక్క నాటిన ప్రధాని

Prime Minister Narendra Modi plants a Parijat sapling
  • అయోధ్యలో బిజీగా మోదీ
  • హనుమాన్‌గఢీలో పూజల అనంతరం మొక్క నాటిన ప్రధాని
  • మరికాసేపట్లో భూమి పూజ
రామ మందిర నిర్మాణ పనుల భూమి పూజ సందర్భంగా అయోధ్యలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.. రామాలయంలోని ఉత్సవ విగ్రహానికి పూజ చేసిన అనంతరం పారిజాత మొక్కను నాటారు. అంతకుముందు హనుమాన్‌గఢీ ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. మరికాసేపట్లో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ భౌతిక దూరం పాటిస్తూ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరోవైపు, భూమి పూజ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీజీ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి.
Ayodhya
Ram Mandir
Narendra Modi
Parijata plant

More Telugu News