Narendra Modi: మరికాసేపట్లో అయోధ్యకు మోదీ.. తొలుత హనుమాన్‌గఢీ ఆలయంలో పూజలు

Modi leave for Ayodhya
  • 12.30 నుంచి 12.45 వరకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ
  • కార్యక్రమానికి ముందు పారిజాత మొక్క నాటనున్న ప్రధాని
  • అయోధ్యను ఆనుకుని ఉన్న 9 జిల్లాల్లోనూ పటిష్ఠ భద్రత
రామ మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో అయోధ్యకు బయలుదేరారు. మరికాసేపట్లో అయోధ్య చేరుకోనున్న ఆయన తొలుత హనుమాన్‌గఢీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 12 గంటలకు భూమి పూజ నిర్వహించనున్న ప్రదేశానికి చేరుకుని 12.30 నుంచి 12.45 గంటల వరకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతకంటే ముందు పారిజాత మొక్కను నాటుతారు. మరోవైపు, భూమిపూజ సందర్భంగా అయోధ్య మొత్తాన్ని ఎస్పీజీ బలగాలు తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. అయోధ్యను ఆనుకుని ఉన్న 9 జిల్లాల్లోనూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Narendra Modi
Ayodhya Ram Mandir
SPG

More Telugu News