Cristiano Ronaldo: రూ. 75 కోట్లతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును కొన్న రొనాల్డో!

Cristiano Ronaldo buys worlds most expensive car
  • ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 కార్లు మాత్రమే తయారీ
  • రొనాల్డో గ్యారేజీలో రూ. 264 కోట్ల విలువైన కార్లు
  • ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్న క్రిస్టియానో
పోర్చుగల్ జాతీయ ఫుట్‌బాలర్, జువెంటస్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బుగాట్టి లా వాచ్యూర్ ఎన్వైర్ కారును కొనుగోలు చేశాడు. తనకు తానే బహుమతిగా కొనుగోలు చేసిన ఈ కారు ఖరీదు దాదాపు రూ. 75 కోట్లు (8.5 మిలియన్ యూరోలు).  ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి పది కార్లను మాత్రమే సంస్థ తయారు చేసింది. తాను కారు కొనుగోలు చేసిన విషయాన్ని ఈ స్టార్ ఆటగాడు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 35 ఏళ్ల రొనాల్డో గ్యారేజీలో ప్రస్తుతం 30 మిలియన్ యూరోలు (రూ. 264 కోట్ల) విలువైన కార్లు ఉండడం గమనార్హం.
Cristiano Ronaldo
Bugatti La Voiture Noire
Portugal
footballer

More Telugu News