ప్రజాకవి వంగపండు ప్రసాదరావు కన్నుమూత
- గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వంగపండు
- 1972లో జననాట్య మండలి స్థాపన
- అక్షరం ఉన్నంత వరకు వంగపండు ఉంటారన్న గద్దర్
వందలాది జానపదాలకు ప్రాణం పోసిన ఆయనకు 2017లో కళారత్న పురస్కారం లభించింది. వంగపండు మృతి విషయం తెలిసిన వెంటనే విప్లవకవి గద్దర్ స్పందించారు. ఆయనది పాట కాదని, అది ప్రజల గుండె చప్పుడు అని కొనియాడారు. అక్షరం ఉన్నంత వరకు ఆయన జీవించి ఉంటారని అన్నారు. పాటను ప్రపంచంలోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి వంగపండు అని ప్రశంసించారు.