China: చైనాకు దీటుగా దెప్సాంగ్‌ వద్ద 15 వేల బలగాలను మోహరించిన భారత్

India deploys 15000 troops at Depsang in defiance of China
  • దెప్సాంగ్ ప్రాంతాల్లో 17 వేల మంది సైనికులను మోహరించిన చైనా
  • చైనాకు వణుకుపుట్టేలా భారీగా బలగాలను తరలించిన భారత్
  • టీడబ్ల్యూడీ బెటాలియన్‌ ప్రధాన కార్యాలయం నుంచి రోడ్డు నిర్మించే యోచనలో చైనా
భారత సరిహద్దులో చైనా మళ్లీ దుస్సాహసానికి దిగుతోంది. తూర్పు లడఖ్‌లోని దౌలత్ బేగ్ బోల్డీ, దెప్సాంగ్ ప్రాంతాల్లో దాదాపు 17 వేల మంది సైనికులను, యుద్ధ విమానాలను మోహరించి ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు, పెట్రోలింగ్ పాయింట్ల (పీపీ) వద్ద భారత బలగాలను చైనా సైనికులు అడ్డుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది.

దీంతో అప్రమత్తమైన భారత్.. చైనా ఏదైనా దుస్సాహసానికి దిగాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేలా పెద్ద ఎత్తున బలగాలను తరలించినట్టు సమాచారం. ముఖ్యంగా కారకోరం పాస్‌ దగ్గర్లోని పీపీ 1 దగ్గరి నుంచి దెప్సాంగ్‌కు పెద్ద ఎత్తున బలగాలను తరలించినట్టు సైనిక వర్గాలు తెలిపాయి. మొత్తం 15 వేల మంది జవాన్లు అక్కడ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

ఇటీవల భారత భూభాగంలోని పీపీ 7, పీపీ 8 మధ్య చైనా గతంలో నిర్మించిన చిన్నపాటి వంతెనను భారత సైనికులు కూల్చివేశారు. దీంతో ఇప్పుడు టీడబ్ల్యూడీ బెటాలియన్‌ ప్రధాన కార్యాలయం నుంచి కారకోరం కనుమ వరకు రోడ్డు నిర్మించాలని చైనా భావిస్తోంది. అదే జరిగితే  రెండు బెటాలియన్ల మధ్య దూరం చాలా వరకు తగ్గిపోతుంది.
China
India
Depsang
Army

More Telugu News