Pawan Kalyan: పోలీస్ బ్యాక్ డ్రాప్ లో మరోసారి పవన్ కల్యాణ్

Pawan to do police back drop movie once again
  • పవన్, హరీశ్ కలయికలో అప్పట్లో 'గబ్బర్ సింగ్'
  • మరోసారి పోలీస్ బ్యాక్ డ్రాప్ లో చిత్రం
  • పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో దర్శకుడు  
పవన్ కల్యాణ్ నుంచి అభిమానులు ఓ బ్లాక్ బస్టర్ మూవీని ఆశిస్తున్న సమయంలో అప్పట్లో 'గబ్బర్ సింగ్' సినిమా వచ్చింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పూర్తి వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్ అయింది. బాక్సాఫీసు వసూళ్లలో సరికొత్త రికార్డులు కూడా నెలకొల్పింది.

అలాంటి హరీశ్ శంకర్ కాంబినేషన్లో పవన్ కల్యాణ్ మరో సినిమా చేయనున్నారన్న వార్త ఇటీవల అధికారికంగా వచ్చింది. దాంతో అప్పటి నుంచీ ఈ సినిమా ఏ తరహా కథాంశంతో రూపొందుతోందన్న కుతూహలం అభిమానుల్లో నెలకొంది.

ఇక తాజా సమాచారం ప్రకారం, 'గబ్బర్ సింగ్' లానే ఇది కూడా పోలీస్ బ్యాక్ డ్రాప్ లోనే రూపొందుతుందట. దీనికి సంబంధించిన కథ ఇప్పటికే పూర్తయిందనీ, ప్రస్తుతం పూర్తి స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో దర్శకుడు హరీశ్ ఉన్నాడనీ తెలుస్తోంది. ఇందులో పవన్ కల్యాణ్ ని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన స్టయిల్ లో చూపించే విధంగా ఆ పాత్రను హరీశ్ డిజైన్ చేస్తున్నాడట. ఏమైనా, ఈ చిత్రంపై ఇప్పటి నుంచే అభిమానుల్లోనూ, ట్రేడ్ వర్గాలలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
Pawan Kalyan
Hareesh Shanka
Gabbarsing

More Telugu News