Korukanti Chander: రామగుండం టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

Ramgundam TRS MLA Korukanti Chander tested corona positive
  • కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోరుకుంటి చందర్
  • ఇటీవలే రామగుండం మేయర్ కు కరోనా పాజిటివ్
  • మేయర్ తో కలిసి మొక్కలు నాటిన చందర్
తెలంగాణలో కరోనా బారినపడుతున్న ప్రజాప్రతినిధుల జాబితా క్రమంగా పెరుగుతోంది. తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. వారం క్రితం రామగుండం మేయర్ అనిల్ కుమార్ కు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో ఎమ్మెల్యే చందర్ కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా ఉన్నట్టు వెల్లడైంది.

ఇటీవలే రామగుండం మేయర్ అనిల్ కుమార్ తో కలిసి చందర్ సింగరేణి కాలరీస్ లో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. 48 ఏళ్ల చందర్ తనకు కరోనా సోకడంపై మాట్లాడుతూ, ప్రస్తుతం తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, త్వరలోనే ప్రజాసేవకు పునరంకితం అవుతానని తెలిపారు. ప్రజలు కచ్చితంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Korukanti Chander
TRS
MLA
Corona Virus
Positive
Ramagundam
Telangana

More Telugu News