నా సవాల్ కు 48 గంటల్లో చంద్రబాబు సమాధానం చెప్పాలి: బొత్స
- దమ్ముంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలి
- బాబుకు మతిస్థిమితం సరిగా లేదనే విషయం అర్థమవుతోంది
- ఆయన కుట్రలు, కుతంత్రాలను కొనసాగబోనివ్వం
అధికార వికేంద్రీకరణను వ్యతిరేకించి చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోయారని అన్నారు. చంద్రబాబుకు సొంత ప్రాంతమైన రాయలసీమలో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తుంటే... దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచినట్టుగానే సొంత గడ్డకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను కొనసాగనివ్వబోమని అన్నారు.