Rhea: రియా చక్రవర్తి ఎక్కడికీ వెళ్లలేదు: న్యాయవాది స్పష్టీకరణ

Advocate of Rhea condemns Bihar police statements
  • రియాపై బీహార్ పోలీసులకు సుశాంత్ కుటుంబం ఫిర్యాదు
  • రియా కనిపించకుండా పోయిందన్న బీహార్ పోలీసులు
  • ఆమెకు నోటీసులే రాలేదన్న న్యాయవాది సతీశ్
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం నేపథ్యంలో ఇటీవల హీరోయిన్ రియా చక్రవర్తి కనిపించకుండా పోయిందన్న వార్తలు వినిపించాయి. సుశాంత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్న బీహార్ పోలీసులు రియా కనిపించడం లేదంటూ ఆరోపణలు చేశారు.

దీనిపై రియా న్యాయవాది సతీశ్ స్పందించారు. బీహార్ పోలీసుల ఆరోపణలను ఖండించారు. రియా చక్రవర్తి ఎక్కడికీ వెళ్లలేదని, ఆమెకు ఇప్పటివరకు బీహార్ పోలీసుల నుంచి సమన్లే రాలేదని స్పష్టం చేశారు. రియా అదృశ్యమైందంటూ బీహార్ పోలీసులు చెబుతుండడం సరికాదన్నారు. అసలీ కేసులో దర్యాప్తు జరిపే అధికారం బీహార్ పోలీసులకు లేదని తెలిపారు. ఈ కేసును ముంబయికి బదిలీ చేయాలంటూ రియా ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని వివరించారు.
Rhea
Lawyer
Satish
Bihar Police
Sushant Singh Rajput

More Telugu News