Yanamala: దమ్ముంటే చంద్రబాబు సవాల్ ను జగన్ స్వీకరించాలి: యనమల

Jagan has to accept Chandrababus challenge says Yanamana
  • రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది
  • 13 జిల్లాల అభివృద్ధి కుంటుపడుతోంది
  • రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా ముందుకు రావాలి
దమ్ముంటే అసెంబ్లీని రద్దుచేసి, ఎన్నికలకు వెళ్లాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. జగన్ కు 48 గంటల సమయాన్ని ఇస్తున్నానని.... ఆయన నుంచి స్పందన రాకపోతే 48 గంటల తర్వాత తాను మళ్లీ మీడియా ముందుకు వస్తానని చెప్పారు.

ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత యనమల స్పందిస్తూ... దమ్ముంటే చంద్రబాబు సవాల్ ను జగన్ స్వీకరించాలని అన్నారు. అసెంబ్లీని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని చెప్పారు. రాజధాని అనేది ముమ్మాటికీ ప్రజలకు సంబంధించిన అంశమని తెలిపారు. జగన్ రాజకీయాల వల్ల 13 జిల్లాల అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని... ఏపీని కాపాడుకోవడానికి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Yanamala
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News