Rahul Gandhi: రాఖీ పండుగ సందర్భంగా తన సోదరిని ఆప్యాయంగా హత్తుకున్న రాహుల్

Rahul Gandhi and Sister Priyanka Wish Each Other On Raksha Bandhan With Photos
  • రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకున్న రాహుల్, ప్రియాంక
  • ట్విట్టర్ ద్వారా ఫొటో షేర్ చేసిన రాహుల్
  • అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన రాహుల్
సోదర, సోదరీమణులు ఆత్మీయతానురాగాలను, ప్రేమాభిమానాలను పంచుకునే రాఖీ పౌర్ణమి నేడు. రాఖీ పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా తమ సోదరులకు అక్కా, చెల్లెళ్లు రాఖీ కట్టి తమ ప్రేమను పంచుతున్నారు. నీకు నేను అండగా ఉన్నాననే భరోసాను, ధైర్యాన్ని అక్కా, చెల్లెళ్లకు వారి సోదరులు ఇస్తున్నారు. ప్రియాంకాగాంధీ, రాహుల్ గాంధీ కూడా రాఖీ పండుగను జరుపుకున్నారు. తన చెల్లెలు ప్రియాంకాగాంధీని ప్రేమతో హత్తుకున్న ఫొటోను ఈ సందర్బంగా రాహుల్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
Rahul Gandhi
Priyanka Gandhi
Congress
Rakshabandhan

More Telugu News