Janvy Kapoor: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Janvy Kapoor next will be Malayalam remake
  • రీమేక్ లో నటిస్తున్న జాన్వీ కపూర్
  • భారీ రేటుకి అఖిల్ సినిమా హక్కులు
  • జపాన్ లో విడుదల కానున్న మరో తెలుగు సినిమా
*  తాజాగా 'గుంజన్ సక్సేనా' చిత్రంలో నటించిన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తన తదుపరి చిత్రం కోసం మలయాళం సినిమాను ఎంచుకుంది. మలయాళంలో వచ్చిన 'హెలెన్' చిత్రం హిందీ రీమేక్ లో జాన్వీ కథానాయికగా నటించనుంది. ఈ చిత్రాన్ని వాళ్ల తండ్రి బోనీ కపూర్ నిర్మిస్తారు.
*  అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం శాటిలైట్ హక్కులను మాటీవీ సొంతం చేసుకుంది. 6.5 కోట్లకు ఈ హక్కులను మాటీవీ తీసుకుందట. ఇదిలావుండగా, ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేస్తారు.
*  మన తెలుగు చిత్రాలు జపాన్ లో అరుదుగా రిలీజ్ అవుతుంటాయి. ఈ కోవలో ఇప్పుడు మరో తెలుగు చిత్రం కూడా విడుదలవుతోంది. నవీన్ పోలిశెట్టి హీరోగా స్వరూప్ దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన 'ఏజంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' చిత్రం ఇక్కడ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడీ చిత్రాన్ని జపనీస్ లోకి డబ్ చేసి, వచ్చే నెలలో అక్కడ రిలీజ్ చేయనున్నారు.  
Janvy Kapoor
Akhil Akkineni
Bommarillu Bhaskar
Naveen Polishetty

More Telugu News