Pakistan: పాకిస్థాన్ టీవీ చానల్ ‘డాన్’లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం!

pak tv channel hacked and showing Indian tricolour
  • ప్రోగ్రాం మధ్యలో మువ్వన్నెల జెండా రెపరెపలు
  • దానికిందే ‘హ్యాపీ ఇండిపెండెన్స్ డే’ అంటూ శుభాకాంక్షలు
  • హ్యాకర్లపై చర్యలు తప్పవని హెచ్చరించిన ‘డాన్’
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టీవీ చానల్ డాన్‌లో భారత మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. చానల్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ప్రోగ్రాం మధ్యలో త్రివర్ణ పతాకం స్క్రీన్‌పై కనిపించేలా చేశారు. దానికిందే ‘హ్యాపీ ఇండిపెండెన్స్ డే’ అన్న శుభాకాంక్షలు కూడా కనిపించాయి. ఇది చూసిన పాక్ ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

పాక్ టీవీ చానల్‌లో భారత జెండా రెపరెపలేంటంటూ ఆశ్చర్యపోయారు. మరోవైపు, డాన్ చానల్ యాజమాన్యం కూడా విస్తుపోయింది. చివరికి తేలిందేమిటంటే.. చానల్‌ హ్యాక్ అయిందట! పాకిస్థాన్ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3:30 గంటలకు ఓ ప్రోగ్రాం మధ్యలో ఇది ప్రసారమైంది. ఈ ఘటనపై స్పందించిన డాన్ యాజమాన్యం.. హ్యాకర్లపై చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.
Pakistan
Dawn News
Indian flag
hackers

More Telugu News