Kona Raghupathi: ఏపీ ఉప సభాపతి కోన రఘుపతికి కరోనా... భార్యకు కూడా పాజిటివ్

AP assembly deputy speaker Kona Raghupathi and his wife tested corona positive
  • ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
  • డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి స్వల్ప జ్వరం
  • కరోనా టెస్టులో పాజిటివ్
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ మామూలుగా లేదు. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. తాజాగా, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కరోనా బారినపడ్డారు. స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని వచ్చింది.

కోన రఘుపతి అర్ధాంగికి కూడా కరోనా సోకినట్టు వైద్యపరీక్షల్లో తేలడంతో ఇద్దరూ క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కోన రఘుపతి స్వయంగా వెల్లడించారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. తద్వారా అభిమానులు, కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
Kona Raghupathi
Wife
Corona Virus
Positive
AP Assembly
Deputy Speaker

More Telugu News