Jagan: ఏపీ సీఎం జగన్ కోసం అపురూపమైన కానుక సిద్ధం చేస్తున్న తమిళనాడు స్వర్ణకారుడు

Tamilnadu goldsmith prepare a gift made of gold for AP CM Jagan
  • సీఎం జగన్ పథకాల పట్ల ఆకర్షితుడైన దేవన్
  • దేవన్ స్వస్థలం తిరుపత్తూరు జిల్లా ఆంబూరు
  • బంగారంతో ఏపీ మ్యాప్ తయారుచేయనున్న దేవన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తమిళనాడుకు చెందిన దేవన్ అనే స్వర్ణకారుడు ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తున్నాడు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ను బంగారంతో రూపొందిస్తానని, దాన్ని సీఎం జగన్ కు అందిస్తానని దేవన్ తెలిపాడు. దేవన్ స్వస్థలం తిరుపత్తూరు జిల్లా ఆంబూరు. సీఎం జగన్ ఏపీలో మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ఆయన కోసం పసిడితో చేసిన ఏపీ మ్యాప్ అందిస్తానని దేవన్ వెల్లడించాడు. కాగా, దేవన్ బక్రీద్ సందర్భంగా బంగారం, వెండితో మసీదు ప్రతిమను రూపొందించాడు.
Jagan
Goldsmith
Devan
Tamilnadu
Andhra Pradesh
Gold Map

More Telugu News