Venkaiah Naidu: ఈ ఉదయమే మాణిక్యాలరావు కుమార్తె సింధుతో మాట్లాడాను... అంతలోనే..!: ఉప రాష్ట్రపతి

Venkaiah Naidu conveys condolences to the demise of former minister Manikyakalarao
  • మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి
  • కరోనాతో కన్నుమూత
  • ఎంతో బాధాకరమన్న వెంకయ్యనాయుడు
బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. ఈ ఉదయమే మాణిక్యాలరావు కుమార్తె సింధుతో మాట్లాడానని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నానని వెల్లడించారు. అంతలోనే ఇలా జరగడం బాధాకరమని పేర్కొన్నారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధత ఉన్న కార్యకర్తగా, రాష్ట్రమంత్రిగా చిత్తశుద్ధితో ప్రజల సమస్యల పరిష్కారానికి చిరస్మరణీయ కృషి చేశారని మాణిక్యాలరావును కీర్తించారు.
Venkaiah Naidu
Manikyalarao
Death
Corona Virus

More Telugu News