Nara Lokesh: సీఎం జగన్ హింసించే రాజు పులికేసిని తలపిస్తున్నారు: లోకేశ్

Nara Lokesh terms CM Jagan as cruel king Pulikesi
  • రాజధానిలో మరో రైతు గుండె ఆగిందన్న లోకేశ్
  • రైతుల ఉసురు జగన్ కు తప్పకుండా తగులుతుందని వ్యాఖ్యలు
  • మూర్ఖత్వానికి మానవరూపం జగన్ అంటూ విమర్శలు
వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటతో మరో మహిళా రైతు గుండె ఆగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. రాజధాని కోసం 60 సెంట్ల భూమిని ఇచ్చిన మహిళా రైతు సామ్రాజ్యం రాజధాని తరలింపు వార్త విని గుండెపోటుతో మరణించారని లోకేశ్ వివరించారు. తుగ్లక్ నిర్ణయాలకు బలవుతున్న రైతుల ఉసురు జగన్ రెడ్డికి తప్పకుండా తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"మూర్ఖత్వానికి ప్రతిరూపం వైఎస్ జగన్. 79 మంది రైతుల్ని పొట్టనబెట్టుకున్నా ఆయన అహం చల్లారలేదు. 14 నెలల్లో ఏ ప్రాంతంలోనూ ఒక్క ఇటుకైనా పెట్టని జగన్ రెడ్డి, మూడు రాజధానులు నిర్మిస్తానంటూ హింసించే రాజు పులికేసిని తలపిస్తున్నాడు" అంటూ విమర్శించారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్లు చేశారు.
Nara Lokesh
Jagan
Pulikesi
Amaravati
Farmers
Three Capitals

More Telugu News