Pawan Kalyan: మూడు రాజధానులపై రేపు పవన్ కల్యాణ్ కీలక సమావేశం!

Pawan Kalyan to host a meeting with Janasena Political Affairs Committee
  • మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదంతో వేడెక్కిన రాజకీయం
  • పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులతో చర్చించనున్న పవన్
  • భవిష్యత్ కార్యాచరణపై రేపు ప్రకటన వెలువడే అవకాశం
మూడు రాజధానుల బిల్లుకు, సీఆర్డీయే రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు ఆగస్టు 15వ తేదీన విశాఖ రాజధానికి శంకుస్థాపన చేసే పనుల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. మరోవైపు, ప్రభుత్వ నిర్ణయంపై నిరసన కార్యక్రమాలకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, జనసేన రేపు కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది.

జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో మూడు రాజధానులపై నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అమరావతి రైతులకు జనసేన అండ ఎలా ఉండాలనే విషయంపై కూడా చర్చలు జరపనున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణపై జనసేన నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Pawan Kalyan
Janasena
3 Capitals

More Telugu News