Revanth Reddy: కేసీఆర్ బాధ్యతారాహిత్యానికి ఇదే పరాకాష్ఠ: రేవంత్ రెడ్డి

revanth reddy fires on kcr
  • కరోనా కల్లోలంతో ప్రజలు చస్తున్నారు
  • కోర్టులు తిడుతున్నా కేసీఆర్‌కి చీమకుట్టినట్టైనా లేదు
  • ‘ఎవడి పిచ్చి వాడికి ఆనందం’ అన్నట్టుంది
  • సచివాలయం పై 11 గంటల సుదీర్ఘ సమీక్ష చేశారు
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 'కరోనా కల్లోలంతో ప్రజలు చస్తున్నా, కోర్టులు తిడుతున్నా, నిపుణులు హెచ్చరిస్తున్నా సీఎంకు చీమకుట్టినట్టైనా లేదు. ‘ఎవడి పిచ్చి వాడికి ఆనందం’ అన్నట్టు కరోనా సమస్యను గాలికి వదిలేసి సచివాలయంపై 11 గంటల సుదీర్ఘ సమీక్ష చేయడం సీఎం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ' అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

ఈ సందర్భంగా ఓ దినపత్రికలో వచ్చిన వార్తను రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్ నిన్న మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 వరకు సుదీర్ఘ సమావేశం జరిపినట్లు అందులో పేర్కొన్నారు. కొత్త సచివాలయంలో కార్యాలయాలు, పేషీలు, అంతస్తుల విస్తీర్ణాలపై చర్చ జరిగిందని చెప్పారు. మూడు రోజుల్లో సచివాలయం అంశంపై మరో సమావేశంలో సీఎం పాల్గొననున్నారని అందులో పేర్కొన్నారు.
Revanth Reddy
Congress
KCR
TRS

More Telugu News