Vijay Sai Reddy: కరోనా నుంచి కోలుకుని తొలి ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి

vijaya sai reddy tweets after dishcharge
  • భగవంతుడి దయతో కోలుకున్నాను
  • శ్రేయోభిలాషుల ప్రార్థనలతో ఆరోగ్యం మెరుగుపడింది
  • అందరికీ కృతజ్ఞుడిని
  • కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఆయన మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. దాదాపు 10 రోజుల తర్వాత ఆయన తొలిసారి ట్వీట్‌ చేశారు.

'భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నాను. అందరికీ కృతజ్ఞుడిని. మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Vijay Sai Reddy
YSRCP
Corona Virus

More Telugu News