అంతర్జాతీయ చిత్రోత్సవానికి ఎంపికైన నాని చిత్రం 'జెర్సీ'

Jersey movie starred by Nani has been selected for screening in Toronto film festival
  • గతేడాది రిలీజైన 'జెర్సీ'
  • నాని నటించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు
  • ఆగస్టు 9 నుంచి 15 వరకు టొరంటో చిత్రోత్సవం
క్రికెట్ పట్ల ఓ ఆటగాడికి ఉన్న అనురక్తిని ఎంతో హృద్యంగా, భావోద్వేగభరితంగా చూపించిన చిత్రం 'జెర్సీ'. ఈ సినిమాలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది విడుదలై విమర్శల ప్రశంసలు అందుకుంది. తాజాగా అపురూపమైన ఘనత దక్కించుకుంది.

'జెర్సీ' చిత్రం ఓ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు వెళుతోంది. నాని నటనా ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన ఈ సినిమా ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆగస్టు 9 నుంచి 15 వరకు జరగనుంది. 'జెర్సీ' చిత్రమే కాకుండా, 'సూపర్ 30', కార్తీ నటించిన 'ఖైదీ' (తమిళ్) కూడా టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేయనున్నాయి.
Go Back to Shorts
Jersey
Nani
Toronto
Film Festival
Tollywood

More Telugu News