అదే జరిగితే... భారత్, చైనా రెండూ ఓడిపోయినట్టే: చైనా
- ఇండియాతో ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటాం
- భారత్ కు చైనా వ్యూహాత్మక ముప్పు కాదు
- వ్యాపార బంధాలను తెంచుకుంటే ఇరు దేశాలు ఓడిపోయినట్టే
రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉన్నాయని... ఈ వ్యాపార బంధాలను బలవంతంగా తుంచేసుకుంటే... అది రెండు దేశాలకు ఓటమిగా మిగిలిపోతుందని అన్నారు. గాల్వాన్ ఉద్రిక్తత తర్వాత పలు చైనా యాప్ లను ఇండియా రద్దు చేసింది. ఇదే సమయంలో చైనాకు సంబంధించిన పలు కాంట్రాక్టులను కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో, ఆయన పైమేరకు స్పందించారు. ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లోనూ చైనా జోక్యం చేసుకోదని... ఇదే సమయంలో తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవద్దని కూడా కోరుతున్నామని చెప్పారు. హాంకాంగ్, తైవాన్, షింజియాంగ్ తదితర అంశాలు తమ అంతర్గత వ్యవహారాలని తెలిపారు.