Software sharada: ‘సాఫ్ట్‌వేర్ శారద’ దుకాణంలో కూరగాయల చోరీ

software sharada vegetables theft

  • డిగ్నిటీ ఆఫ్ లేబర్‌కు ప్రతీకగా నిలిచిన శారద
  • మిగిలిన కూరగాయలను రోజులానే కవర్‌తో కప్పి వెళ్లిన వైనం
  • రూ. 5 వేల విలువైన కూరగాయల చోరీ

‘సాఫ్ట్‌వేర్ శారద’ ఇటీవల ఈ పేరు అటు ప్రధాన మీడియాలో, ఇటు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అయింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన ఆమె ఉద్యోగం కొవిడ్ కారణంగా పోయింది. ఉద్యోగం పోయినా మనోస్థైర్యం మాత్రం కోల్పోని శారద జీవనాధారం కోసం దారులు వెతికింది. చివరికి హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో ఫుట్‌పాత్‌పై కూరగాయలు విక్రయిస్తున్న వైనం మీడియా కెక్కి సంచలనమైంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన శారద కూరగాయలు విక్రయిస్తూ డిగ్నిటీ ఆఫ్ లేబర్‌కు ప్రతీకగా నిలిచిందని ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆమె గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నటుడు సోనూసూద్ స్పందించి ఉద్యోగం ఆఫర్ చేశాడు.

ఈ విషయాన్ని పక్కనపెడితే శారద కూరగాయల దుకాణంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి కూరగాయలు విక్రయించిన తర్వాత మిగతా వాటిని బండిపైనే ఉంచి కవర్‌తో కప్పి రోజూలానే ఇంటికి వెళ్లిపోయింది. అయితే, ఆ తర్వాతి రోజు దుకాణానికి వస్తే బండిపై ఉండాల్సిన కూరగాయలు మాయమయ్యాయి. మొత్తంగా రూ. 5 వేల విలువైన కూరగాయలు మాయమైనట్టు శారద ఆవేదన వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News