Motkupalli Narsimhulu: నర్సింహులుది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వం చేసిన హత్య: మోత్కుపల్లి

TRS govt is supressing Dalits says Motkupalli
  • నర్సింహులు కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలి
  • కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
  • టీఆర్ఎస్ పాలనలో దళితులను అణచి వేస్తున్నారు
రైతు నర్సింహులు ఆత్మహత్య నేపథ్యంలో అధికార పార్టీపై బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆరోపణలు చేశారు. నర్సింహులుది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్య అని అన్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నర్సింహులు కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వడంతో పాటు... కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో దళితుల అణచివేత జరుగుతోందని మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం దారుణమని అన్నారు. కేసీఆర్ నియతృత్వం పరాకాష్ఠకు చేరిందని దుయ్యబట్టారు.
Motkupalli Narsimhulu
BJP

More Telugu News