నిజంగా నీవు మహాత్ముడివి సోనూ: బ్రహ్మాజీ

You are a real Mahatma Sonu says Brahmaji
  • పేదలకు సాయం చేస్తూ నిజమైన హీరోలా నిలిచావు
  • నీ సేవలను ప్రభుత్వం గుర్తించాలి
  • నిన్ను పద్మభూషణ్ కు సిఫారసు చేయాలి
కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన సినీ నటుడు సోనూసూద్ ఆపద్బాంధవుడిగా మారాడు. రీల్ లైఫ్ లో విలన్ అయినప్పటికీ... రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచి వాళ్ల సొంత ఊళ్లకు పంపించాడు. విదేశాల్లో చిక్కుకుపోయిన విద్యార్థుల కోసం ప్రత్యేక విమానాలను పంపించాడు. ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్ వేర్ శారదకు ఒక కంపెనీలో ఆఫర్ లెటర్ ఇప్పించాడు. ఒకటేమిటి... ఎన్ని రకాలుగా సాయం చేయాలో అన్నీ చేస్తున్నాడు. పెద్దపెద్ద స్టార్లు కూడా చేయలేని పనులను చేస్తూ... జనాల చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.

ఈరోజు సోనూసూద్ 47వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోనూకు సినీ నటుడు బ్రహ్మాజీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. 'మైడియర్ సోనూసూద్ హ్యాపీ బర్త్ డే. కష్టకాలంలో పేదలకు అండగా నిలుస్తూ నిజమైన హీరోలా నిలిచావు. నీ సేవలను ప్రభుత్వం గుర్తించాలని, పద్మభూషణ్ కు నిన్ను  సిఫారసు చేయాలని కోరుకుంటున్నా. నిజంగా నీవు మహాత్ముడివి సోనూ' అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు.
Go Back to Shorts
Brahmaji
Sonu Sood
Tollywood

More Telugu News