sanchayita: నాపై విమర్శలు చేసే వీరిద్దరికీ ఈ పరిణామం మౌనం నేర్పిస్తుందని ఆశిస్తున్నా: సంచయిత గజపతిరాజు

sanchayita fires on tdp
  • 'ప్రసాద్' పథకం కింద సింహాచలం పుణ్యక్షేత్రం ఎంపిక
  • అధికారంలో ఉండగా టీడీపీ ఈ గ్రాంటు తెచ్చుకోలేదు
  • చంద్రబాబు, అశోక్ గజపతి ఈ పనిచేయకపోవడం విచారకరం
విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం అప్పన్న దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్’ పథకంలో చోటుదక్కిందని తాజాగా మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్ ‌పర్సన్ సంచయిత గజపతిరాజు తెలిపారు. భారత్‌లో ముఖ్య‌మైన ప‌ర్యాట‌క‌, ఆధ్యాత్మిక‌, ధార్మిక ప్ర‌దేశాల అభివృద్ధి కోసం కేంద్ర సర్కారు ప్ర‌సాద్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. ఏపీలో ఇప్పటికే శ్రీశైలం, తిరుప‌తి దేవ‌స్థానాల‌ను ఈ ప‌థ‌కం కింద‌ ఎంపిక చేసి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నారు.

ఈ విషయంపై  సంచయిత గజపతిరాజు స్పందిస్తూ.. 'సింహాచలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్‌’ పథకం కింద ఎంపిక చేసింది. అధికారంలో ఉండగా చంద్రబాబు గారు గానీ, అశోక్ గజపతి గానీ కేంద్రం నుంచి ఈ గ్రాంటును తెచ్చుకోవడానికి ప్రయత్నించకపోవడం విచారకరం. నాపై విమర్శలు చేసే వీరికి ఈ పరిణామం మౌనం నేర్పిస్తుందని ఆశిస్తున్నా' అని  విమర్శలు గుప్పించారు.

sanchayita
Telugudesam
Andhra Pradesh

More Telugu News