marathi film industry: భారత చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. మరాఠీ యువ నటుడు అశుతోష్ ఆత్మహత్య

Marathi actor Ashutosh Bhakre dies by suicide
  • నాందేడ్‌లోని తల్లిదండ్రుల ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య
  • తెలియరాని కారణాలు
  • ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు వస్తాయో విశ్లేషిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్
భారత చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మరాఠీ యువ నటుడు అశుతోష్ భక్రే (32) నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. నాందేడ్‌లోని తన తల్లిదండ్రుల నివాసంలో ఉరివేసుకుని మృతి చెందాడు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

అయితే, అతడు గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అశుతోష్ నెల రోజుల క్రితమే నాందేడ్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఇటీవల ఓ వీడియోను పోస్టు చేసిన అశుతోష్.. ఆత్మహత్య గురించి ఓ వ్యక్తి ఎందుకు ఆలోచిస్తాడనే విషయాన్ని విశ్లేషించినట్టు పోలీసులు పేర్కొన్నారు.

కాగా, అశుతోష్ నాలుగేళ్ల క్రితం మరాఠీ టీవీ నటి మయూరి దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్నాడు. 2013లో అతడు నటించిన ‘భకార్’ చిత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మరాఠీలో పాప్యులర్ టీవీ షో అయిన ‘కులాటా కాలి కులానే’తో మయూరికి బాగా పేరొచ్చింది.
marathi film industry
Asutosh Bhakre
Suicide
Nanded

More Telugu News