Rajamouli: దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్

Rajamouli tests with Corona positive
  • రాజమౌళితో పాటు కుటుంబ సభ్యులకు స్వల్ప కరోనా పాజిటివ్
  • హోం క్వారంటైన్ లో ఉన్నామన్న దర్శకదిగ్గజం
  • అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ట్వీట్
దేశ వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా  దర్శక దిగ్గజం రాజమౌళి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. రెండు రోజుల క్రితం తాను, తన కుటుంబసభ్యులు స్వల్ప జ్వరంతో బాధపడ్డామని చెప్పారు. జ్వరం తగ్గిపోయిందని... అయినప్పటికీ తాము కోవిడ్ టెస్టులు చేయించుకున్నామని... తమకు స్వల్ప స్థాయిలో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నామని చెప్పారు. ఇప్పుడు బాగానే ఉన్నామని తెలిపారు. కరోనా లక్షణాలు లేకపోయినా అన్ని నిబంధనలు పాటిస్తున్నామని, జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. యాంటీబాడీలను డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని... ఆ తర్వాత ప్లాస్మా దానం చేస్తామని తెలిపారు.
Rajamouli
Corona Virus
Positive
Tollywood

More Telugu News