Atchannaidu: అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు 

court rejects actchannaidu pitition
  • ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఆరోపణలపై అరెస్టయిన అచ్చెన్న
  • ప్రస్తుతం ఆసుపత్రిలో అచ్చెన్నకు చికిత్స
  • ఇటీవల హైకోర్టులో బెయిల్ పిటిషన్
ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఆరోపణలపై అరెస్టయి విచారణ ఎదుర్కొంటోన్న టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. అలాగే, ఈ కేసులో సంబంధం ఉన్న ఇతరులు వేసుకున్న అన్ని బెయిల్‌ పిటిషన్‌లను కూడా కొట్టేసింది. బెయిల్‌ పిటిషన్లు వేసుకున్న వారిలో రమేశ్ కుమార్, మురళీ, సుబ్బారావు కూడా ఉన్నారు.

కాగా, అచ్చెన్నాయుడు ఏపీ మంత్రిగా పనిచేసిన సమయంలో మందులు, సంబంధిత పరికరాల కొనుగోళ్లలో అవకతవకలకు, అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలోనూ తనకు బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్లు పెట్టుకోగా కింది కోర్టు వాటిని అప్పట్లోనే కొట్టివేసింది.
Atchannaidu
Telugudesam
Andhra Pradesh

More Telugu News