Corona Virus: దేశంలో 15 లక్షలు దాటిన కరోనా కేసులు

Over 48000 coronavirus cases
  • 48,513 మందికి కొత్తగా కరోనా
  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 15,31,669
  • మృతుల సంఖ్య మొత్తం 34,193
  • 5,09,447 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
భారత్‌లో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... గత 24 గంటల్లో భారత్‌లో 48,513 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 768 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 15,31,669 లక్షలకు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 34,193కి పెరిగింది. 5,09,447 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 9,88,030 మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు మొత్తం 1,77,43,740 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు  కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  నిన్న ఒక్కరోజులో  4,08,855 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.
Corona Virus
COVID-19
India

More Telugu News