పవన్ కల్యాణ్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్?
- టాలీవుడ్ లో రకుల్ కి తగ్గిన అవకాశాలు
- పవన్, క్రిష్ సినిమా నుంచి ఆఫర్
- మొగలాయీ పాలన కాలం నాటి కథ
పవన్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పిరీడ్ మూవీలో కథానాయిక పాత్రకు రకుల్ తో సంప్రదింపులు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో నటించే హీరోయిన్లుగా బాలీవుడ్ భామ జాక్విలిన్ ఫెర్నాండెజ్, ప్రగ్యా జైస్వాల్ వంటి పేర్లు వినిపించాయి. మరి, రకుల్ ని మరో హీరోయిన్ గా తీసుకుంటున్నారా? అన్నది తెలియాల్సివుంది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే, 'వకీల్ సాబ్' సినిమాతో పాటు ఈ చిత్రాన్ని కూడా పవన్ మొదట్లోనే అంగీకరించారు. లాక్ డౌన్ కి ముందు కొంత షూటింగ్ కూడా నిర్వహించారు. మొగలుల పాలనా కాలం నాటి వాతావరణంలో ఈ చిత్రకథ సాగుతుందని అంటున్నారు. దీనికి 'విరూపాక్ష' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు కూడా ఇంతకుముందే ప్రచారం జరిగింది.