శ్రీశైలంలో దర్శనాలు మరికొన్ని రోజులు రద్దు... తిరుమలకు అంతంతమాత్రంగానే భక్తులు!
- శ్రీశైలంలో ప్రబలుతున్న కరోనా
- స్వామి సేవలన్నీ ఏకాంతమే
- తిరుమలకు 5,491 మంది భక్తులు
ఇదిలావుండగా, తిరుమలకు వస్తున్న భక్తుల రాక మరింతగా మందగించింది. దర్శనాల సంఖ్య రోజుకు 6 వేలు దాటడం లేదు. నిన్న మంగళవారం స్వామిని 5,491 మంది దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. హుండీ ద్వారా 42 లక్షల ఆదాయం లభించిందని తెలిపారు. ఆన్ లైన్ మాధ్యమంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు, వైరస్ భయంతో దర్శనాలకు రావడం లేదని అధికారులు అంచనా వేశారు. త్వరలోనే స్థానికంగా దర్శనం టికెట్లను తిరిగి జారీ చేసే విషయమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.