Hyderabad: భార్యను చంపేసి.. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన భర్త!

Man killed Varalakshmi is her 9th husband says SI
  • పహాడీ షరీఫ్ పీఎస్ పరిధిలో వరలక్ష్మి అనే వివాహిత హత్య
  • గొంతు కోసి దారుణంగా హతమార్చిన భర్త
  • వరలక్ష్మి మృతదేహం ఉస్మానియా మార్చురీకి తరలింపు
హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరలక్ష్మి అనే వివాహిత హత్య కలకలం రేపింది. ఆమెను ఆమె భర్తే గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వరలక్ష్మి (35), ఆమె భర్త నాగరాజు (36) తరచుగా గొడవపడేవారు. వరలక్ష్మిని నాగరాజు తరచుగా కొట్టేవాడని చుట్టుపక్కల వాళ్లు తెలిపారు.

కొన్ని సందర్భాల్లో ఆమె భయపడి స్నేహితుల ఇళ్లలో దాక్కునేదని చెప్పారు. నిన్న రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వరలక్ష్మి గొంతును కత్తితో కోసి, ఇంటి బయట నుంచి తాళం వేసి పారిపోయాడని చెపుతున్నారు. ఈ సందర్భంగా పహాడీ షరీఫ్ ఎస్సై కుమారస్వామి మాట్లాడుతూ, వరలక్ష్మికి నాగరాజు తొమ్మిదో భర్త అని చెప్పారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు వరలక్ష్మి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
Hyderabad
woman
murder

More Telugu News