Fueling: గాల్లోనే ఇంధనం నింపుకుంటున్న రాఫెల్... ఫొటోలు ఇవిగో!

Rafale jet fighters fueling in mid air

  • నిన్న ఫ్రాన్స్ నుంచి భారత్ బయల్దేరిన రాఫెల్ విమానాలు
  • భారత్ చేరే క్రమంలో 7 వేల కిమీ ప్రయాణం 
  • 30 వేల అడుగుల ఎత్తులో ఇంధనం నింపుకున్న జెట్లు

భారత్ వాయుసేన శక్తిని రెట్టింపు చేసే విమానాలుగా మన్ననలు అందుకుంటున్న రాఫెల్ విమానాలు నిన్న ఫ్రాన్స్ ఉంచి భారత్ బయల్దేరిన సంగతి తెలిసిందే. ఈ ఐదు విమానాలు ఫ్రాన్స్ నుంచి దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి భారత్ చేరుకోవాల్సి ఉంది. అందుకే వీటి వెంట ఓ ఇంధన ట్యాంకర్ విమానం కూడా వచ్చింది. ఈ క్రమంలో గాల్లోనే రాఫెల్ విమానాలు ఇంధనం నింపుకున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను ఫ్రాన్స్ లోని భారత దౌత్య కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది. కాక్ పిట్ సమీపంలో ఉన్న ఓ పైప్ ద్వారా రాఫెల్ విమానాలు ఇంధనం నింపుకున్నాయి. దాదాపు 30 వేల అడుగుల ఎత్తులో ఇంధనం నింపుకునే ప్రక్రియను విజయవంతంగా ముగించాయి.

  • Loading...

More Telugu News