Sonu Sood: ఏపీలో సోనూ సూద్, చంద్రబాబుల ఫొటోలకు పాలాభిషేకం

Milk shower for Sonu Sood and Chandrababu in AP
  • ఇటీవల ఓ రైతుకు ట్రాక్టర్ కానుకగా ఇచ్చిన సోనూ సూద్
  • ఆ రైతు బిడ్డలను తాను చదివిస్తానన్న చంద్రబాబు
  • సూపర్ హీరోగా మారిన సోనూ సూద్

ఇటీవల చిత్తూరు జిల్లాలో ఓ రైతు పరిస్థితికి చలించిపోయిన నటుడు సోనూ సూద్ లేటెస్ట్ మోడల్ సోనాలికా ట్రాక్టర్ ను కానుకగా పంపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కరోనా లాక్ డౌన్ సమయంలో వేలమంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించి రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్... కాడెద్దులుగా మారి పొలం దున్నిన అక్కాచెల్లెళ్ల దీనస్థితికి కదిలిపోయి ట్రాక్టర్ కొనివ్వడంతో ఈసారి సూపర్ హీరో అయిపోయాడు.

అటు, ఆ అక్కాచెల్లెళ్లను తాము చదివిస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకు రావడంతో ఆయనపైనా అభినందనల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో, ఏపీలో ఓ ప్రాంతంలో సోనూ సూద్, చంద్రబాబు ఉన్న బ్యానర్ కు టీడీపీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. కొత్త సినిమాలు రిలీజైనప్పుడు హీరోల కటౌట్లకు అభిషేకం నిర్వహించిన రీతిలో సోనూ, చంద్రబాబుల కటౌట్ కు క్షీరాభిషేకం చేశారు.


  • Loading...

More Telugu News