Sushant Singh Rajput: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే.. తేల్చేసిన ఫోరెన్సిక్ ల్యాబ్

Sushant singh death caused by suicide only tells FSL report
  • గత నెల 14న అనుమానాస్పద స్థితిలో మరణించిన సుశాంత్
  • ఊపిరి అందక, ఉక్కిరిబిక్కిరై చనిపోయినట్టు చెప్పిన పోస్టుమార్టం నివేదిక
  • తాజాగా వచ్చిన ఫోరెన్సిక్ నివేదిక

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) మరణంపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. జూన్ 14న సుశాంత్ బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. పోస్టుమార్టం నివేదికలో అతడు ఊపిరి అందక, ఉక్కిరిబిక్కిరై చనిపోయినట్టు తేలడంతో అతడి మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మరింత లోతుగా విచారణ మొదలుపెట్టారు.


ఇందులో భాగంగా కలీనాలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (ఎఫ్ఎస్ఎల్) ని ఆశ్రయించి సుశాంత్‌ది హత్యా? ఆత్మహత్యా? తేల్చాలని కోరారు. తాజాగా, ఇందుకు సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ నివేదిక పోలీసులకు అందింది. అందులో సుశాంత్‌ది ఆత్మహత్యేనని స్పష్టం చేసింది. ఫలితంగా సుశాంత్ మరణంపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి.

Sushant Singh Rajput
Bollywood
Suicide
forensic lab

More Telugu News