Brad Hogg: సురేశ్ రైనా జట్టులోకి రావడం కష్టమే: ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్

Its not so easy for Raina to play again for India says Brad Hogg
  • రైనా గొప్ప ఆటగాడు అనడంలో సందేహం లేదు
  • కోహ్లీ యువ ఆటగాళ్లపై మొగ్గు చూపుతున్నాడు
  • రైనా జట్టులోకి రావడానికి అవకాశాలు చాలా తక్కువ
భారత క్రికెటర్ సురేశ్ రైనాకు ఇకపై జట్టులో స్థానం దక్కడం కష్టమేనని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డారు. రైనా గొప్ప ఆటగాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదని... కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టులో రైనాకు స్థానం దొరకడం అసాధ్యమనే చెప్పుకోవాలని అన్నారు. యువ ఆటగాళ్లపైనే కెప్టెన్ కోహ్లీ దృష్టి సారిస్తున్నాడని.. జట్టుకు ఎక్కువ కాలంపాటు సేవలందించే యువకుల పట్ట కోహ్లీ మొగ్గు చూపుతున్నాడని చెప్పారు.

రైనా ఆడే నాలుగో స్థానం కోసం మరో యువ క్రికెటర్ ను వెతికే పనిలో కోహ్లీ ఉన్నాడని తెలిపారు. ఈ నేపథ్యంలో రైనా జట్టులోకి రావడానికి అవకాశాలు చాలా తక్కువని చెప్పారు. రైనా వంటి ఆటగాడు దేశానికి మరి కొంత కాలం పాటు ఆడితే బాగుంటుందని... అయితే, అది సాధ్యపడదని అన్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి తాను కూడా బాధపడుతున్నానని చెప్పారు.
Brad Hogg
Suresh Raina
Virat Kohli
Team India

More Telugu News